16 July, 2026 | 12:37 AM

కార్మికనగర్‌లో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పర్యటన

16-07-2026 12:00 AM

జూబ్లీహిల్స్, జూలై 1౫ (విజయక్రాంతి): కార్మికనగర్ ప్రాంతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పర్యటిం చారు. బుధవారం నిర్వహించిన పర్యటనలో భాగంగా ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండులో నిర్మాణ దశలో ఉన్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పనులను పరిశీలించారు. గ్రౌండ్ చుట్టూ నిర్మిస్తున్న కంచె పనులను పురోగతిని గుత్తేదారు ద్వారా తెలుసుకున్నారు.

అనంతరం వినాయకనగర్ ప్రాంతంలో ఎమ్మెల్యే పర్యటించగా స్థానికులు డ్రైనేజీ సమస్యను గురించి ఆయన దృష్టికి తీసుకొ చ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమస్యకు కారణాలను తెలుసుకుం టామన్నారు. భవిష్యత్తులో డ్రైనేజీ సమస్య తలెత్తకుండా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. అధికారు లు అందుకు అనుగునంగా ప్రణాళికలు రూ పొందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, నివాసితులు తదితరులు పాల్గొన్నారు.