16 July, 2026 | 12:17 AM

ఓటు హక్కు పౌరుల ప్రాథమిక హక్కు

16-07-2026 12:00 AM

ఫిర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి

మేడిపల్లి, జూలై 15 (విజయక్రాంతి): ఓటు హక్కు భారత పౌరుల ప్రాథమిక హక్కు అని పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్ సర్కిల్ పీర్జాదిగూడ వార్డు పరిధిలోని బుద్ధానగర్ లో కొనసాగుతున్న సంక్షిప్త ఓటర్ సవరణ కార్యక్రమంలో జక్క వెంకట్ రెడ్డి పాల్గొని సర్ నిర్వహణ, ఎదురవుతున్న సమస్యలపై బీఆర్‌ఎస్ పార్టీ బీఎల్‌ఏ లతో సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు భారత పౌరుల ప్రాథమిక హక్కు అని, ప్రతి పౌరుడు సర్ లో పాల్గొని తమ తమ ఓటుకు సంబంధించిన డిక్లరేషన్ ఇవ్వాలని సూచించారు. సర్ అనగానే చాలా మంది ఆందోళన చెందుతున్నారని, డిక్లరేషన్ ఫారం లో వివరాలు నమోదు చేసి బీఎల్‌ఓలకు అందిస్తే ఓటు కోల్పోయే పరిస్థితి ఉండదన్నారు.

కానీ డిక్లరేషన్ విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డి, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్‌ఎస్ పార్టీ మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు కొరిపెల్లి నిర్మల, యువజన విభాగం మాజీ అధ్యక్షులు పైళ్ల ప్రభాకర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు గూడూరు నర్సింహారెడ్డి, మంద జగన్నాథం, చిర్ర సంతోష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఏనుగు మల్లారెడ్డి, పాశం నర్సింహారెడ్డి,లక్ష్మి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.