22 July, 2026 | 3:32 PM

సింగరేణి మనుగడ కోసం కలసి పోరాడుదాం

22-07-2026 02:30 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): సింగరేణి మనుగడ కోసం యూనియన్లు తమ విభేదాలను పక్కనపెట్టి పోరాటాలలో కలిసి రావాలని ఏఐటియూసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మిట్టపల్లి వెంకట్ స్వామి పిలుపునిచ్చారు. 17,18న మెడికల్ బోర్డులో కార్మికులకు జరిగిన అన్యాయానికి నిరసనగా శాంతిఖనిలోజరిగిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. సింగరేణి కంపెనీలో  కనీవిని ఎరుగని రీతిలో కార్మికుల శ్రమశక్తిని దోపిడీ చేసే విధానాలను వెంటనే విరమించుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానీకి విజ్ఞప్తి చేశారు. సింగరేణి కార్మిక సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం వల్లే సమస్త మనుగడ ప్రశ్నార్థకమవుతుందని వాపోయారు.  గత 17 మాసాలుగా మెడికల్ బోర్డు నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేసి కార్మికుల గొంతుకోసిందని విమర్శించారు.

జూలై నెలలో 17 18 తేదీలలో జరిగిన మెడికల్ బోర్డు పారదర్శకత్వం లేకుండా నిర్వహించి కేవలం మీరు 24 మందిని మాత్రమే మెడికల్ ఇన్వాలిడేషన్ చేసి కార్మికుల కొంపలు ముంచారనీ మండిపడ్డారు. యజమాన్య ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని హెచ్చరించారు. కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి తాడిచెర్ల (2 ) మైన్ సింగరేణికి అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఒప్పించడాన్ని స్వాగతిస్తూన్నామన్నారు. సింగరేణిలో సర్వే చేసిన 15 నూతన బొగ్గు గనులు ఓసీలను సింగరేణికి అప్పగించే విధంగా కృషిచేయాలని డిమాండ్ చేశారు. అందుకోసం బిజెపి ప్రభుత్వం పై  తెలంగాణ ఎంపీలు రాజకీయాలను పక్కన పెట్టీ సింగరేణి మనుగడ కోసం కృషి చేయాలని కోరారు.

మెడికల్ బోర్డులను క్రమం తప్పకుండా నిర్వహించి మెడికల్ బోర్డుకు అప్లికేషన్ పెట్టుకున్న వారిని మెడికల్ ఎగ్జామ్ నిర్వహించి ఇన్వాల్వ్ డెసిషన్ చేసి  కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇప్పించే విధంగా  ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం పాటుపడాలన్నారు. సింగరేణి సమ్మె నోటీసు డిమాండ్లను  పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచి ప్రచార కార్యదర్శి మంతెన రమేష్ ఫిట్ కార్యదర్శి రత్నం ప్రవీణ్, సహాయ కార్యదర్శి దాడి రమేష్ మైన్స్ కమిటీ సభ్యులు సేఫ్టీ సభ్యులు పాల్గొన్నారు.