22 July, 2026 | 3:38 PM

సాటాపూర్ చౌరస్తాలో కాంగ్రెస్ నిరసన

22-07-2026 02:32 PM

బోధన్, జూలై 22 (విజయక్రాంతి): రెంజల్ మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తూ రెంజల్ మండల కాంగ్రెస్ పార్టీ(Congress protests) నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మండల అధ్యక్షుడు సాయిరెడ్డి, బోధన్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కార్తీక్ యాదవ్ మాట్లాడుతూ, పరీక్షా పత్రాల లీకేజీ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న యువతపై లాఠీచార్జ్ చేయడం, కాంగ్రెస్ నాయకులపై కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆరోపించారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలని రాష్ట్రపతిని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు రాములు, మాజీ సర్పంచ్ జవీదుద్దీన్, వినోద్, ఓబీసీ సెల్ మండల అధ్యక్షుడు నితిన్, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎంఎల్ రాజు, సర్పంచ్‌లు ధనుంజయ్, గాయజుద్దీన్, ఉపసర్పంచ్ జూబేర్, అఫ్జల్ ఖాన్, కుద్దూస్, జిల్లా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అబ్బోల్ల శ్రీకాంత్, రెంజల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గైని కిరణ్, ఎస్సీ సెల్ మండల ఉపాధ్యక్షుడు రాకేష్, బోగిడి రవి, యోగేష్ పటేల్, బాబు నాయక్, సురేష్ పటేల్, అంజగౌడ్, శశాంత్, సద్దాం, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.