15 June, 2026 | 1:50 AM

అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే నాయిని

15-06-2026 12:40 AM

బాధిత కుటుంబానికి అండగా ఉంటానని హామీ.

ఘటన బాధ్యుతలపై చర్యలు 

తీసుకోవాలని అధికారులకు వెల్లడి

హనుమకొండ, జూన్ 14 (విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ఈ రోజు శనివారం ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదంలో దగ్ధమైన సమ్మయ్య నగర్కు చెందిన రెండ్ల శ్రీనివాస్ పాత పుస్తకాల గోదాంను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఘటన జరిగిన తీరును బాధితుడు రెండ్ల శ్రీనివాస్ను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అగ్నిప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. అనంతరం సంఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ అధికారులకు ఫోన్ ద్వారా సూచించారు.

ప్రమాదం కారణంగా జరిగిన ఆస్తి నష్టంపై సంబంధిత అధికారులతో విచారణ జరిపించి, ప్రభుత్వ పరంగా అందించగల సహాయక చర్యలను బాధిత కుటుంబానికి అందించేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే నాయిని, ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల తరఫున అవసరమైన సహకారం అందిస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక  పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.