27 July, 2026 | 12:26 PM

Breaking News

బ్లాక్ బుక్‌లో మొదటి పేరు మంత్రి పొన్నం ప్రభాకర్ దే

26-06-2024 12:54 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జూబ్లీహిల్స్ ఫిలింనగర్ లోని వెంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఫ్లైయాష్ వ్యవహారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కు కౌశిశ్ రెడ్డి సవాల్ చేశారు. వెంకటేశ్వరస్వామి గుడిలో ప్రమాణం చేద్దామని కౌశిక్ సవాల్ విసిరారు. కౌశిక్ రెడ్డి తెలంగాణ భవన్ నుంచి వెంకటేశ్వర స్వామి గుడి వచ్చారు. ''మంత్రి పొన్నం తనకు లీగల్ నోటీసులు పంపారు.. వెంకటేశ్వరస్వామి గుడికి వచ్చి పొన్నం ప్రమాణం చేయాలని సవాల్ చేశా. నిన్న నా స్వగ్రామలో దేవుడి సాక్షిగా ప్రమాణం చేశా. మంత్రి రాలేదంటే అవినీతి నిరూపితమవుతోంది. 5 ఏండ్ల తరువాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది.. కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. బ్లాక్ బుక్ లో మొదటి పేరు మంత్రి పొన్నం ప్రభాకర్ దే. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అవినీతి కక్కిస్తాం'' అని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.