18 April, 2026 | 3:55 PM

Breaking News

మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి   •   ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్‌... DA పెంపు   •   హార్ముజ్ జలసంధి మళ్లీ బంద్‌ — ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్— ఇరాన్ సంచలన ప్రకటన   •   రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం   •   మహిళా బిల్లు వీగిపోవడం— బీజేపీ విధానాల ఓటమి   •   దేశ మహిళలకు అన్యాయం.. కాంగ్రెస్, బీజేపీ‎ల‎పై హరీశ్‎రావు కీలక వ్యాఖ్యలు   •   వర్క్ షాప్ కోసం అనుమతి ఇవ్వండి   •   కరీంనగర్ లో విజయక్రాంతి వార్షికోత్సవ వేడుకలు   •   రాఘవపేటలో బడిబాట కార్యక్రమం   •   దళిత క్రిస్టియన్స్ పై సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి   •  

అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ఎమ్మెల్యే పల్లాకు ఘనస్వాగతం..

05-06-2025 11:40 PM

జనగామ (విజయక్రాంతి): జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(MLA Palla Rajeshwar Reddy) ఇటీవల అమెరికాలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ(BRS Silver Jubilee Celebration)లో పాల్గొని తిరిగి గురువారం రాత్రి స్వదేశానికి చేరుకున్నారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆయన అడుగు పెట్టగానే, జనగామ నియోజకవర్గానికి చెందిన పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు  ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆయనకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. ఈ సందర్బంగా అమెరికాలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సభ విశేష స్పందన తెచ్చుకుందన్నారు. తెలంగాణ అభి వృద్ధి మార్గాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో ఇది మైలురాయిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.