నాణ్యమైన భోజనాన్ని అందించాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్
వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్, (విజయక్రాంతి): వసతి గృహాలకు సన్న బియ్యాన్ని అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం జరగడం లేదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీసీ, ఎస్సీ, బాలికల వసతి గృహాలను ఎమ్మెల్యే శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహాల పరిసరాలను పరిశీలించారు.
అనంతరం మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించి విద్యార్థులలో కలిసి భోజనం చేశారు. న్యాయమైన భోజనం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. అదేవిధంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెస్ చార్జ్ లను పెంచాలన్నారు. వసతిగృహాల సమస్యలపై ఇటీవల అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల ప్రవీణ్, రత్నాకర్ రెడ్డి, అశోక రెడ్డి, శ్రీనివాస్, అర్జున్, సంతోష్, దశరథ్ పటేల్, మహేందర్ తదితరులు ఉన్నారు.






