రూ.7.50 కోట్ల బీటీ రోడ్ల పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం
పినపాక, మార్చి 15, (విజయక్రాంతి): పినపాక మండలం జానంపేట, భూపతిరావుపేట, వెంకటేశాపురం, గొట్టెల్ల గ్రామాల్లో రూ.7.50 కోట్లఅంచనా వ్యయంతో మంజూరైన బీటీ రోడ్ల పనులను ఆదివారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ రోడ్లు నిర్మాణం పూర్తయితే ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతుందన్నారు. గ్రామాల అభివృద్ధికి రోడ్లు దోహదపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐటిడిఏ ఏఈ శ్రీనివాస్ రావు, ఆర్ ఐ రమేష్, పంచాయతీ సెక్రటరీ కాజా హుస్సేన్, జానంపేట సర్పంచ్ పూణెం ఉమామహేశ్వరి, జానంపేట ఉపసర్పంచ్ దాట్ల రాజేష్, 23 గ్రామపంచాయతీ సర్పంచులు, మండల అధ్యక్షులు గోడిశాల రామనాథం, గంగిరెడ్డి వెంకటరెడ్డి, పేరం వెంకటేశ్వర్లు, గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఉడుముల లక్ష్మారెడ్డి, కోర్స ఆనంద్, తోలెం అర్జున్ గారు, బండారి సాంబ, ఆరే నవీన్, కంది విజయ్, భరత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.




