13-04-2025 10:10:20 PM
మణుగూరు/పినపాక,( విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట గ్రామానికి చెందిన ధర్మరాజుల శంకర్, రమాదేవి దంపతుల కుమార్తె సాయి కరుణ, ప్రదీప్ కుమార్ వివాహ వేడుకలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదివారం పాల్గొని నూతన వధూవరులకు ఆశీర్వదించారు. నూతన వస్త్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళ నాయకులు యువజన నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.