13-04-2025 10:06:46 PM
ఎస్సై మమ్మద్ గౌస్
కొల్చారం,(విజయక్రాంతి): కొల్చారం రోడ్లపై ధాన్యాన్ని ఆరబెడితే కఠిన చర్యలు ఉంటాయని మండల స్థానిక ఎస్సై మహమ్మద్ గౌస్ అన్నారు. ఆదివారం రోడ్లపై పోసిన దాన్యాన్ని పరిశీలించారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కల్లాలలోనే వేసి ఆరబెట్టుకోవాలని, జాతీయ రహదారిపై వడ్లు ఆరబెట్టి ప్రజా రవాణాకు భంగం కలిగించకూడదన్నారు. వెంటనే రోడ్డు పైన వేసిన ధాన్యాన్ని తీసివేసి కల్లాలలో ఆరబెట్టాలని రైతులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి 765 డి నిత్యం నిత్యం ఎక్కువ సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి కావున ఈ రహదారి పైన వరి ధాన్యాన్ని ఆరబెడితే ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నందున ఈ విషయమును రైతులు గమనించి జాతీయ రహదారి పైన వరి ధాన్యాన్ని ఆరబెట్టకూడదని అన్నారు