17 August, 2026 | 2:57 PM

ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

17-08-2026 02:20 PM

ఆదిలాబాద్, (విజయక్రాంతి): శ్రావణమాసం మొదటి సోమవారం పురస్కరించుకొని ఆదిలాబాద్ లోని గంగపుత్ర శివాలయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపి వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. అనంతరం ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు బొజ్జన్న, బీజేపీ నాయకులు మనోజ్ పవర్ తదితరులు పాల్గొన్నారు.