15-11-2025 12:00:00 AM
నామినేటెడ్ పదవుల్లో దక్కని ప్రతిఫలం
సీనియర్ నేతల్లో తీవ్ర అసంతృప్తి
పార్టీ అధికారులకు వచ్చి రెండేళ్లు అయిన దక్కని ప్రతిఫలం
ప్రజాపాలన ప్రభుత్వంలో పాలకుల వివక్ష..
నిర్మల్, నవంబర్ ౧౪ (విజయక్రాంతి): రాష్ట్రంలో అధికార పార్టీ ప్రజాపాలన ప్రభు త్వం ఎన్నికై డిసెంబర్ వస్తే రెండేళ్లు పూర్తవుతుంది. రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాలో పది సంవత్సరాలు పార్టీని నమ్ముకుని పని చేసిన సీనియర్ నేతలు కార్యకర్తలకు పార్టీ అధికారంలోకి వచ్చేయడంతో పదవులు దక్కుతా యని ఆశపడ్డ నిరాశ ఎదురవుతుంది. ఉమ్మ డి జిల్లాలోని రాజకీయ చైతన్యమున పశ్చిమ జిల్లాలో నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రె స్ పార్టీకి ఖానాపూర్‌కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్ ఒక్కరే ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
పశ్చిమ జిల్లాలో ఆది లాబాద్ బోత్ ఖానాపూర్ నిర్మల్ ముధోల్ నియోజకవర్గం ఉన్నాయి. ఆదిలాబాద్ నిర్మల్ ముధోల్ నియోజకవర్గం బిజెపి ఎమ్మెల్యేలు ప్రాథమిథ్యం వహిస్తుండగా ప్రాతినిథ్యం వహిస్తుండగా బోథ్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పశ్చిమ జిల్లాకు పొలిటికల్ కేంద్రంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేస్తున్న నేతలకు తగిన గుర్తింపు రావాలకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం 2023 డిసెంబర్లో రాష్ట్రంలో అధికారం చేజిక్కి కిందుకుంది. 10 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్ పార్టీని ఓడించడంతో తమ పార్టీ అధికారులకు రావడం తో పదవులు దక్కుతాయని ఉమ్మడి జిల్లా నేతలు ఆశతో ఎదురుచూస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో తూర్పు జిల్లాగా ఆయ న మంచిరాల ప్రాంతంలో ఆసిఫాబాద్ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ప్రాతినిథ్యం వహిస్తుండగా సిర్పూర్ కాగజ్ నగర్ లో బిజెపి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బా బు మంచిర్యాలలో ప్రేమ్‌సాగర్ రావు బెల్లంపల్లిలో మాజీ మంత్రి వినోద్ చెన్నూరులో రాష్ట్ర మంత్రివర్గంలో క్యాబినెట్ హోదా పొందిన జి వెంకటస్వామి ప్రాథనిథ్యం వహిస్తున్నారు.
తూర్పు జిల్లా నుండి వెంకట స్వామి కార్మిక శాఖ మంత్రిగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కార్పొరేషన్ చైర్మన్గా అదే జిల్లా లోని దండేపల్లి చెందిన కోట్నం తిరుపతి రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్‌గా ఇలా రాష్ట్రస్థాయిలో కీలక పదవుల్లో ఉన్నారు. ఎంపీగా ఓడిపోయిన ఆత్రం సుగుణ కూడా రాష్ట్ర స్థాయిలో పదవి దక్కింది
కీలక నేతలు ఉన్న దక్కని పదవులు
పశ్చిమ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన పాత నేతలతో పాటు ఎన్నికల తర్వాత అధికార పార్టీలో చేరిన సీనియర్ నేతలు ఉన్నప్పటికీ నామినేట్ పద వుల పార్టీ పదవులు దక్కకపోవడంపై తీవ్ర నిరాశ చెందుతున్నారు. ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వంటి సీనియర్ నేతలు ఇక్కడ నేతలతో మంచి సంబంధాలు ఉన్నప్పటికీ నామినేట్ పదవుల విషయాల ఎంపికలో ఇప్పటివరకు ఒక్క నాయకుని కూడా న్యాయం జరగకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా రు.
ఆ నాయకుల కింద పనిచేసే కార్యకర్తలు కూడా తమ నేతకు రాజకీయ పదవి ప్రాధాన్యత దక్కితే తమ కూడా గౌరవం ఉంటుం దని ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రజా పాలన ప్రభుత్వం పశ్చిమ జిల్లా నేతలపై కనీస కరికరం చూపకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి వేణుగోపాలచారితో పాటు బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లు మంత్రిగా ఈ ఇంద్రకరణ్‌రెడ్డి ముధోల్ నియోజకవర్గం రెండుసార్లు గెలుపొందిన విట్టల్ రెడ్డి ఒకసా రి విజయం సాధించిన నారాయణరావు పటేల్ డిసిసి అధ్యక్షుడు శ్రీహరి రావు ఆదిలాబాద్‌కు చెందిన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి బోథ్ నుంచి మాజీ ఎంపీ సోయం బాపూరావు ఖానాపూ ర్ మాజీ ఎమ్మెల్యే రేఖా శ్యాం నాయక్ పంటి సీనియర్ నేతలందరూ పార్టీలో కొనసాగుతున్నారు.
ఎన్నికలకు ముందు పదేండ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న పార్టీని నమ్ముకుని పని చేస్తున్న కొందరు ముఖ్య నేతలు కూడా ఉన్నారు ఇందులో గ్రంథాలయ చైర్మన్ అర్జుమత్ అలీ మాజీ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాద సుదర్శన్ దశరథం రాజేశ్వర్ జుట్టు అశోక్ వంటి సీనియర్ నేతలు ఉన్నప్పటికీ వారికి నామినేట్ పదవుల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు దశాబ్దాలు శాసించిన మాజీ మంత్రులు వేణుగో పాలచారి ఏ ఇంద్రకరణ్‌రెడ్డి కాంగ్రెస్ నామినేట్ పదవులపై కన్నేసి పావులు కదుపుతు న్న పశ్చిమ జిల్లాలో వారికి తగిన ప్రాధాన్యత పదవులు ఖరారు కాలేదు.
గ్రూపు రాజకీయాలకు ఆజ్యం...
అడుగుల జిల్లా ఆదివాసి జిల్లా అయినా పశ్చిమ ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని కష్టపడి పని చేస్తున్న ముఖ్య నేతలకు పార్టీ పదవులు నామినేటెడ్ పదవులు దక్కితే రాబోయే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు దూదపడనుంది. ప్రస్తుతం పశ్చిమ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రస్థాయిలో శాసించే పదవులు లేకపోవడంతో నేతల మధ్య ఉన్న వర్గ విభేదాలు నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి.
పార్టీని ముం దుంచి నడిపించే సత్తా ఉన్న నేతలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో వారికి సముచితమైన గౌరవం పార్టీ పదవులు దక్కకపోవడంతో వారు నిరాషాన్నిస్కులతో పార్టీ కార్యక్రమాల్లో అంటిముంటున్నట్టుగా వివరిస్తున్నా రు అన్న విమర్శలు విలువస్తున్నాయి. ప్రభు త్వం ఈ నేతలకు ఒకవేళ పదవులను కట్టబెడితే పార్టీ కార్యక్రమాలను వారే ముందుండి నడిపించే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది ఆ దిశగా ప్రజాపాలన ప్రభుత్వం రెండేళ్లలో కనీస చర్యలు తీసుకోకపోవడంతో పశ్చిమ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడేందుకు అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రాజకీయ చైతన్య ఉన్న నిర్మల్ అదిలాబాద్ జిల్లాలో ప్రతిపక్ష పార్టీల నేతలైన బిజెపి నేత మహేశ్వర్ రెడ్డి అదిలాబాద్ ముధోల్ ఎమ్మెల్యేలు పాయల శంకర్ రామారావు పటేల్ బిజెపి పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నారు ఇక టిఆర్‌ఎస్ పార్టీ నుంచి ఆదిలాబాదులో మాజీ మంత్రి జోగు రామన్న, బోథ్ ఎమ్మె ల్యే అనిల్ జాదవ్, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్ ఆ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ప్రజా హామీల వైఫల్యం పై ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన పోరాటం చేస్తూ తమ రాజకీయ ఉనికిని చాటుకుంటున్నారు.
పశ్చిమ జిల్లాలో రాష్ట్రంలో అధికారులు ఉన్న కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం నేతలైన తమ ప్రభుత్వ కార్యక్రమాలను అభి వృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిం చి పార్టీలో పట్టు సాధించేందుకు కనీసం కష్టపడి పని చేయడం లేదు.
దీంతో పార్టీని నమ్ముకొని కష్టపడి పనిచేసిన జిల్లా మండల గ్రామీణ స్థాయి నేతలకు కూడా అన్యాయం జరగడంతో వారు నిరాషాని స్పృహ చెందుతున్నారు పశ్చిమ జిల్లా నుంచి మహిళా కార్యవర్గంలో ఒక కృష్ణవేణి కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా సేవాదళ్లో పనిచేసిన వెంబడి రాజేశ్వర్‌కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాత్ర మే పదవులు దక్కగా మిగతావారు నామమాత్రపు పదవులతో కాలం వెల్లడిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పచ్చిమ జిల్లాకు నామినేట్ పదవుల విషయంలో న్యాయం చేయాలని వారు కోరుతున్నారు ప్రభుత్వం ఏ మేరకు న్యాయం చేస్తుందో వేచి చూడాల్సిందే..
సముచితమైన గౌరవమేదీ..?
ప్రజా పాలన ప్రభుత్వం అధికారులకు వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న నిర్మ ల్ అదిలాబాద్ పశ్చిమ జిల్లాలో పార్టీ నమ్ముకుని పని చేస్తున్న సీనియర్ నేతలకు కార్యకర్తలకు ఎలాంటి గౌరవం పదవులు దక్కకపోవడంపై కాంగ్రెస్లో తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో బలమైన నేత లు ఉన్నప్పటికీ రాష్ట్రస్థాయి పదవులు దక్కకపోవడంతో సీనియర్ నేతలతో పాటు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నిజమైన కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
గత ఎన్నికల్లో ఒక ఖానా పూర్‌లో మాత్రమే సెట్టింగ్ ఎమ్మెల్యే విజయం సాధించగా మిగతా నియోజ క వర్గాల్లో బిజెపి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లు ప్రాథమిక వహించడంతో అధికారిక కార్యక్రమాల్లో జిల్లా నేతలకు సము చితమైన గౌరవం దక్కడం లేదు. రాష్ట్రంలో అధికారులు ఉన్నది తమ ప్రభుత్వం అయినప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం లభించడం లేదు.
దీంతో పార్టీ నేతలు అధికార పార్టీ పదవులు నామినేట్ పదవులు ఇస్తే ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని ఆశించినప్పటికీ ప్రజాపాలన ప్రభుత్వం మా త్రం నామినేట్ పదవుల విషయంలో తీవ్ర జాప్యం చేస్తూ రాష్ట్రస్థాయి కార్పొరేట్ నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం దక్కకపోవడంపై పార్టీ కార్యక్రమాల్లో అంటి ముట్టినట్టుగా ఉంటున్నా రు.
దీంతో జిల్లా అధికారులు ప్రభుత్వ కార్యక్రమాల అమలులో తమ మాట కు గౌరవం ఇవ్వడం లేదని ఇప్పటికే చాలామంది సీనియర్లు పార్టీ అధిష్టానానికి మొరపెట్టుకుంటున్నారు. పశ్చి మ జిల్లా నుంచి ఉన్న ఏకైక ఎమ్మెల్యే వేడుమ బొజ్జు పటేల్ ఒక్కరి అధికార పార్టీ కావడంతో ఆయన ఖానాపూర్ నియోజకవర్గానికి మాత్రమే పరిమిత మై పోతున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో పోటీ ఓడిపోయిన వారిని నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించి పార్టీ కార్య క్రమాలను జరుపుకుంటున్నారు. పశ్చి మ జిల్లాలో పార్టీకి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రాజకీయ నేతలు పార్టీలో కొనసాగుతున్నప్పటికీ వారికి నామినేట్ పదవులు దక్కడం లేదు.