9 May, 2026 | 9:36 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు

09-05-2026 08:54 PM

కారేపల్లి,(విజయక్రాంతి): సింగరేణి మండలం భాగ్యనగర్ తండాలో వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ – లలిత దంపతుల 29వ వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భాగ్యనగర్ సర్పంచ్ బానోత్ హీరాలాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనుచరులు కేక్ కట్ చేసి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాందాస్ నాయక్ – లలిత దంపతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తూ, నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రజల ఆశీస్సులతో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరారు.