9 May, 2026 | 9:37 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి

09-05-2026 08:57 PM

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు 

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు రైతులకు మద్దతు ధర చెల్లిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు అదనపు కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో విద్యా వారోత్సవాలు, ధాన్యం కొనుగోలు, రైతు నమోదు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వం నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించి త్రాగునీరు, నీడ ఏర్పాటు చేసి తూకం యంత్రాలు, బాడీ క్లీనర్ లను అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. రైతు నమోదు ప్రక్రియ అన్ని జిల్లాలలో 100 శాతం పూర్తయ్యేలా  చూడాలని తెలిపారు.

జనగణన 2027 లో భాగంగా ఈ నెల 10వ తేదీ వరకు స్వీయ గణన కార్యక్రమం నిర్వహించాలని, ప్రజలందరికీ తెలిసే విధంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని, ఈ నెల 11వ తేదీ నుండి ఇండ్ల గణన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో 10 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని, వీరంతా స్వీయ గణన చేసుకోవాలని ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11వ తేదీ నుంచి నిర్వహించే విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్ అధికారులతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో  రైతు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని, పంచాయతీ కార్యదర్శుల సహకారం తీసుకొని ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళుతున్నామని తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలను కార్యాచరణ ప్రకారం పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ నెల 11వ తేదీ నుండి ప్రారంభించనున్న ఇండ్ల గణన కార్యక్రమ నిర్వహణ కొరకు ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ పూర్తి చేయడం జరిగిందని, జిల్లాలో సమర్థవంతంగా కార్యక్రమం నిర్వహణ కొరకు కృషి చేస్తామని తెలిపారు.ఈ సమావేశంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.