బాధిత కుటుంబాలకు అండగా ఉంటా..
25-07-2026 01:09 AM
బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్
పాపన్నపేట,జూలై24: బాధిత కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అండగా ఉంటామని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు భరోసానిచ్చారు. ఇటీవల పొడ్చన్ పల్లి గ్రామంలో విద్యుదాఘాతంతో మృతి చెందిన ఎర్ర కిష్టయ్య, రోడ్డు ప్రమాదంలో మరణించిన పాపన్నపేటకు చెందిన రషీద్, రాములు కుటుంబ సభ్యులను, గాయపడిన గౌస్ ను శుక్రవారం మండల నాయకులు, కార్యకర్తలతో కలిసి పరామర్శించి వారితో మాట్లాడారు. ధైర్యంగా ఉండమని భరోసా నిచ్చారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరేందర్ గౌడ్, సర్పంచులు శ్రీనివాస్, శ్రీధర్, ఉప సర్పంచ్ సద్దాం హుస్సేన్, నాయకులు ప్రభాకర్ రెడ్డి, భరత్ గౌడ్, ఖలీమ్, గౌస్, సంగమేశ్వర్ తదితరులు ఉన్నారు.






