23 August, 2026 | 2:26 AM

ఏఎస్ డీడీ లిస్ట్‌పై అవగాహన

23-08-2026 12:17 AM

సికింద్రాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి): పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ ఆధ్వర్యంలో ఎస్ ఐ ఆర్  ఫేజ్2లో భాగంగా ఎస్సార్  నగర్189, 190,191 అమీర్పేట్ 153, 154, 155, సనత్నగర్ 164, 214, 215, బీకే గూడ డివిజన్ 198, 199, 202, 204, 205 బూత్ల పరిధిలో ఏ ఎస్ డి డి లిస్ట్పై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ.. దీపక్ జాన్ తో కలిసి ఆయా బూత్ల పరిధిలో ఇంటింటికీ వెళ్లి ఏ ఎస్ డి డి  లిస్ట్లో పేర్లు వచ్చిన ఓటర్ల వివరాలను పరిశీలించారు. ఓటర్ల వివరాల్లో ఏదైనా తప్పిదం లేదా సమాచార లోపం కారణంగా పేరు ఏ ఎస్ డి డి లిస్ట్లో చేరిందా అనే అంశంపై ఆరా తీసి, వారికి అవసరమైన అవగాహన  కల్పించారు.  మరోవైపు ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి కుటుంబం బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.