24 August, 2026 | 10:28 PM

Breaking News

భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •   8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •  

సమస్యల సత్వర పరిష్కారానికే పల్లె బాట

19-06-2026 01:30 AM

దిలావర్ పూర్‌లో ప్రజలతో నిద్రచేసిన ఎమ్మెల్యే

దామరచర్ల, జూన్ 18: ప్రగతి సింగిడి  జనంతో మాట.. పల్లె బాట కార్యక్రమంలో భాగంగా దామరచర్ల మండలంలోని దిలావర్ పూర్ గ్రామంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పర్యటించారు. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు రాత్రి గ్రామస్థులతో సమావేశమై వారి సమస్యలు, అవసరాలతో పాటు అభివృద్ధి అంశాలపై చర్చించారు. అనంతరం గ్రామంలోనే పల్లె నిద్ర చేసి ప్రజలతో మమేకమయ్యారు.

గురువారం ఉదయం సంబంధిత శాఖల అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే  ప్రతి వీధిలో తిరుగుతూ ప్రజలను కలుసుకుని వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకు న్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు స మర్పించిన పలు సమస్యలు, అభ్యర్థనలను స్వీకరించిన ఎమ్మెల్యే వాటిని అత్యవసరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లడం, గ్రామాల సమగ్ర అభివృద్ధి, ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే ఈ కార్యక్రమ ఉద్దేశమన్నారు.

అనంతరం గ్రామంలో నిర్మాణం పూర్తయిన పది ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించి గృహప్రవేశం చేసారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. తమ సొంత ఇంటి కలను నెరవేర్చిన ప్రజా ప్రభుత్వానికి ఎమ్మె ల్యే కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం ప్రభుత్వం పాఠశాలలో పిల్లలకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసి. ప్రజా ప్రభు త్వం ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ను అందిస్తుందన్నారు. ప్రతిఒక్కరు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  గ్రామ సర్పంచ్ బెజ్జం సాయి, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు..