ముస్లింలకు ఎమ్మెల్యే శ్రీగణేష్ రంజాన్ శుభాకాంక్షలు
కంటోన్మెంట్‌లోని ముస్లింల కుటుంబ సభ్యుల ఇళ్లకు వెళ్లిన ఎమ్మెల్యే
హైదరాబాద్, మార్చి 21(విజయక్రాంతి): పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ శనివారం నియోజకవర్గం లోని పలు ముస్లిం సోదరుల కుటుంబ సభ్యులను వారి నివాసాల్లో కలుసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైన రంజాన్ నెలలో మనసును పవిత్రం చేసుకోవడానికి ఉపవాస దీక్షలు, ప్రార్ధనలు చేసి, పేదలకు దానాలు చేసి, పరస్పర ప్రేమాభిమానాలు పొందిన ముస్లిం సోదర సోదరీ మణులను కలుసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం తన మనసుకు ఆహ్లా దం కలిగించిందని ఎమ్మెల్యే ఈ సందర్భం గా అన్నారు. రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఎమ్మెల్యే వెంట కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వేణు గోపాల్ రెడ్డి, నరేష్, రఫిక్, నయీమ్, గఫార్, తౌఫిక్, జిలానీ, వాహెబ్, ఆంజనేయులు, యూసఫ్ భాను, యాదగిరి తదితరులు ఉన్నారు.




