28 June, 2026 | 3:13 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

వేగంగా పనులు చేయండి

06-05-2026 01:59 AM

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్‌నగర్ టౌన్, మే 5 : వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలు, వ్యాపారులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అధికారులను, కాంట్రాక్టర్ను ఆదేశించారు. మార్కెట్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించి, పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులను స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన ఘనంగా సన్మానించారు. అలాగే నియోజకవర్గంలోని 334 మంది అంగన్వాడి టీచర్లకు స్థానిక అంబేద్కర్ కళాభవన్ లో  స్మార్ట్ ఫోన్లను  ఎమ్మెల్యే పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యాన,పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రైతు వారము కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరి సంక్షేమం కోసం ప్రతిక్షణం ప్రజాపాలన ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కార్పొరేటర్ చిన్న, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి, మోయీజ్, ఇమ్రాన్, నగర కార్పొరేషన్ కమిషనర్ రామాంజనేయులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.