calender_icon.png 29 September, 2025 | 5:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ఆత్మ బతుకమ్మ: విశ్వవ్యాప్తంగా ప్రతిష్ట పెంచిన పండుగ

29-09-2025 04:02:33 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(Sanathnagar MLA Talasani Srinivas Yadav) తెలిపారు. ఆదివారం రాత్రి బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వద్ద నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవంతుడిని పూలతో పూజిస్తామని, ఆ పూలను పూజించే పండుగ బతుకమ్మ అన్నారు. తెలంగాణ లో పుట్టిన బతుకమ్మ నేడు విశ్వవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వం లో బతుకమ్మను ఎంతో ఘనంగా నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. 9 రోజుల పాటు మహిళలు, యువతులు ఎంతో భక్తితో బతుకమ్మ ఆడుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమీర్ పేట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, బిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులు బాసా లక్ష్మి, నాగలక్ష్మి, శ్రీలక్ష్మి, దుర్గ, శ్రీ రంజని, అరుణ, బిఆర్ఎస్ పార్టీ  డివిజన్ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్, నామన సంతోష్ కుమార్, కూతురు నర్సింహ, కట్టా బలరాం, వనం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.