23-06-2025 08:34:55 PM
దుమ్ముగూడెం/చర్ల (విజయక్రాంతి): తుమ్మగూడెం మండలం, చిన్న బండి రేవు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఆకస్మిక తనిఖీ చేసి చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిలను భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు(MLA Tellam Venkata Rao) అడిగి తెలుసుకున్నారు, వారికి మనోధైర్యాన్ని కల్పించి డాక్టర్ను అందుబాటులో ఉండేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గంగోలు గ్రామంలో వివిఆర్ ఫంక్షన్ హాల్ నందు మహ్మద్ షహిన్ షా వెడ్స్ తస్లిమా వివాహ రిసెప్షన్ వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొని నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.