1 May, 2026 | 4:09 AM

రైతులకు అండగా ప్రభుత్వం

01-05-2026 02:25 AM

బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మద్నూర్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): రైతులు ఎదుర్కొన్న నాస్తాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. మద్నూర్ మండలం షేకాపూర్ లో బుధవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 100 ఎకరాలలో మొక్కజొన్న, జొన్న, వరి పంట ప్రమాదవశాత్తు దగ్ధమైన విషయాన్ని తెలుసుకొని బాధితులను గురువారం ఎమ్మెల్యే పరామర్శించారు.

భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు పునరాగం కాకుండా జాగ్రత్తగా తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతుల పండగ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా కల్పించారు. అధికారులతో మాట్లాడి ఘటనపై పూర్తి వివరాలు సేకరించి అగ్ని ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా విచారణ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానికా అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.