30 June, 2026 | 9:02 PM

Breaking News

ఎఫ్‌పీఓలతో రైతులు ఆర్థికంగా బలోపేతం   •   పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్   •   పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానించిన ఎస్పీ రోహిత్ రాజ్   •   జూన్‌లో 171 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా   •   సమగ్ర విచారణ జరిపి ఎలాంటి చర్యలు తీసుకోలేదు   •   సింగరేణి అధికారులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు టీబీజీకేఎస్ సంఘీభావం: కాపు కృష్ణ   •   మా పాఠశాలలో పిల్లలను చేర్పించండి   •   పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి ఘన సన్మానం: డీఎం అండ్ హెచ్ ఓ తుకారాం రాథోడ్   •   రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •  

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే తోట

03-12-2024 04:44 PM

జుక్కల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పిట్లంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంత రావు మంగళవారం పరిశీలించారు. గత ప్రభుత్వం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు అని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా త్వరలోనే ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణ బిల్లులు, మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మండల కేంద్రంలో ఖాళీగా ఉన్న స్థలాన్ని పరిశీలించి అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకుంటామని ఎమ్మెల్యే  చెప్పారు. ఆయన వెంట ఏఎంసి ఛైర్మన్ మనోజ్, నాయకులు హన్మండ్లు, శపథం రెడ్డి, రామ్ రెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.