బిచ్చగాడిగా మారిన ఎమ్మెల్యే!
- ముంబై ప్రజల్లో సహాయ గుణాన్ని గుర్తించా
- జీవితం అంటే అర్థమైంది ‘పరాగ్ షా’
- సోషల్ మీడియాలో వైరల్గా చిత్రాలు
ముంబై, సెప్టెంబర్ 15: అచ్చం ‘బిచ్చగాడు’ (Bichagadu)సినిమాను తలపిస్తుందీ ఘటన. మహారాష్ట్ర ముంబై బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఒకరోజు బిచ్చగాడి అవతారమెత్తాడు. రోడ్లపై అడుకున్నాడు. ఆయన ఆస్తుల విలువ రూ. 3,300కోట్లకు పైగా ఉన్నా ఆయన తీసుకున్న ఈ నిర్ణయం వెనుక బలమైన కారణమే ఉంది.
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని తూర్పు ఘట్కోపర్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా. జైన సంప్రదాయం ప్రకారం ఎంతటి సంపన్నుడైనా సంవత్సరంలో ఒకసారైనా భిక్షం ఎత్తుకోవాల్సి ఉంటుందని ఆయన గురువు సూచన మేరకు ఈ దీక్ష బూనాడు.
ఈయన భిక్షగాడి అవతారం వీడియోలు, ఫోటోలు సామాజిక, వార్తా మాధ్యమాల్లో వైరల్గా మారాయి. అయితే భిక్షగాడిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సమాజం ఇచ్చే గౌరవం వేరుగా ఉన్నప్పటికీ ముంబై ప్రజల్లో ఉన్న సహాయ గుణాన్ని మాత్రం గుర్తించానని మీడియాతో అన్నారు. ప్రజల్లో ఇంకా ఈ గుణం ఉండడం ఎంతో గొప్ప విషయమని పరాగ్ షా పేర్కొన్నారు. ఈ దీక్ష వల్ల తనకు జీవితం అంటే ఏందో అర్థమైందని వివరించారు.