ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్నగర్ ఏప్రిల్ 3 (విజయక్రాంతి): రెండు రోజుల క్రితం నందిగామ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారికి రేషన్ కార్డ్ కోసం నందిగామకు చెందిన వృద్ధురాలు లక్ష్మమ్మ ఎమ్మెల్యేను మొరపెట్టుకుంది. అప్పుడు రేషన్ కార్డు ఇప్పిస్తానని ఆమెకు మాట ఇచ్చిన ఎమ్మెల్యే... ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం బాధితురాలు లక్ష్మమ్మకు రేషన్ కార్డు ఇప్పించారు.
కేవలం మూడు రోజుల్లో సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులతో మాట్లాడి రేషన్ కార్డు అందజేసి సన్న బియ్యం అందించిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్నింటిని విడతలవారిగా అమలు చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఏం శివశంకర్ గౌడ్, ఆర్ ఐ శ్రీనివాస్, సర్పంచ్ కొమ్ము కృష్ణ,మార్కెట్ డైరెక్టర్ సి నర్సింలు,ఉప సర్పంచ్, వెంకటేష్ గౌడ్, వార్డు సభ్యులు అగ్గిప్రసాద్, అగ్గి మమత సూరి, శివగళ్ల సురేష్, బొమ్మగల్ల నర్సింలు, టైలర్ కృష్ణ, నాయకులు చంద్రపాల్ రెడ్డి, కావలి కృష్ణ,జిల్లెల్ల బాల్ రెడ్డి, తదితరులు ఉన్నారు.




