విద్య బోధన, వసతులపై కలెక్టర్ ఆరా
ఆశ్రమోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ కే. హరిత
జైనూర్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): జైనూర్ మండలంలోని రాసిమెట్ట బాలికల ఆశ్రమోన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ కె. హరిత శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని కూరగాయల స్టోర్ రూమ్, మరుగుదొడ్లు, బాత్రూమ్లను పరిశీలించారు.అనంతరం పాఠశాలలో విద్యార్థినులకు తాగునీటి వసతి, మెను ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అనే విషయాలను విద్యార్థినులను అడి గి తెలుసుకున్నారు.
విద్య బోధన సక్రమంగా జరుగుతున్నదా, ఉపాధ్యాయు లు సమయానికి పాఠశాలకు వస్తున్నారా అనే అంశాలపై కూడా విద్యార్థి నులు, ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. హరిత మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని తెలిపారు. తనిఖీ సమయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనిత లేకపోవడంతో, హెచ్ ఎం ఎక్కడికి వెళ్లారని ఉపాధ్యాయులను అడగగా, ఆమెకు జ్వరం రావ డంతో ఆసుపత్రికి వెళ్లినట్లు తెలిపారు.
ఉపాధ్యాయులు విద్య బోధన సక్రమంగా నిర్వహిస్తున్నారా అనే విషయా న్ని కలెక్టర్ విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులు కష్టపడి చదు వుకుని జీవితంలో ఒక లక్ష్యంతో ముం దుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, వర్కర్లు, విద్యార్థినీలు పాల్గొన్నారు.




