13 March, 2026 | 3:11 PM

గజవాహనంపై ఊరేగిన లక్ష్మీనరసింహుడు

13-03-2026 02:04 PM

గజ్వేల్,(విజయక్రాంతి):  సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో(Nachagiri Lakshmi Narasimha Swamy Brahmotsavam) భాగంగా గురువారం రాత్రి గజవాహనంపై పురవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఊరేగింపుగా స్వామి వారి ఉత్సవ మూర్తి తరలిరాగా, సభా మండపంపై  భక్తులు భజన , భక్తి పాటలను ఆలపించారు. కార్యక్రమంలో చైర్మన్ రవీందర్ గుప్త, ఆలయ కార్య నిర్వహణ అధికారి బి రంగాచారి, సభ్యులు చందా నాగరాజు, ఉష రాజశేఖర్ శర్మ, జక్కన్న గారి శేఖర్ గుప్త, నాయకం శ్రీనివాస్, ఆలయ సిబ్బంది శ్రీ సంతోషిమాత సేవా సమితి సభ్యులు, అనంతగిరిపల్లి భజన మండలి  సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.