22 June, 2026 | 3:21 PM

Breaking News

బయోలాజికల్, పీఈటి పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఉడుత శంకర్ యాదవ్ తండ్రిని పరామర్శించిన కనీస వేతనాల చైర్మన్ జనక్ ప్రసాద్   •   SIR ప్రక్రియలో తప్పొప్పులకు తావివ్వకండి   •   దుందుభి వాగుపై హై లెవెల్ బ్రిడ్జికి మంత్రి సీతక్క శంకుస్థాపన   •   డీటీవో వెంకన్న మృతి ఘటనపై విచారణకు ఆదేశం   •   బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •  

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది.

06-02-2026 08:54 PM

 నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల,(విజయక్రాంతి): ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని మున్సిపల్  ఎన్నికల ప్రచారంలో భాగంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం  చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా 5వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గుండెబోయిన శ్రీలక్ష్మి – సైదులు, 03వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గాలి యాదమ్మ – లింగయ్య లకు మద్దతుగా ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రజల కోసం పని చేయడం నా బాధ్యత, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించడం మీ బాధ్యత అని పేర్కొంటూ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, చిట్యాల మున్సిపాలిటిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజల సహకారం అవసరమని తెలిపారు. మన ప్రభుత్వంలో ప్రజలకు మేలు చేసే ఎన్నో సంక్షేమ పథకాలు అమలులో ఉన్నాయి.

ప్రతి వార్డులో అవసరమైన చోట్ల సీసీ రోడ్ల నిర్మాణం, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరించడమే తమ లక్ష్యం అని తెలిపారు. ఇప్పటికే మన ప్రభుత్వంలో పేదలకు సన్నబియ్యం సరఫరా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమలులో ఉన్నాయని గుర్తు చేశారు.

ప్రజల ఆశీర్వాదంతో అభివృద్ధి, సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్, మారగోని ఆంజనేయులు గౌడ్, ఏనుగు రఘుమారెడ్డి,  జనగాం రవీందర్ గౌడ్, వడ్డేపల్లి లక్ష్మీపతి, జోగు సురేష్, పామునుగుల బుచ్చి రాములు, ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.