calender_icon.png 24 June, 2025 | 6:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే వెంకట్రావు

24-06-2025 12:02:43 AM

జిల్లా పవర్ లిఫ్టింగ్ జనరల్ సెక్రెటరీ జీవి రామిరెడ్డి

భద్రాచలం, జూన్ 23 (విజయ క్రాంతి)ఆగస్టు 2 నుండి 7 వరకు కేరళలో జరిగే జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికైన భద్రాద్రి కొత్తగూడెం జి ల్లా క్రీడాకారులను భద్రాచలం ఎ మ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు సోమవారం అభినందించారు. క్రీడాకారు లు అందరూ బం గారు పతకాలు సాధించాలని కోరుకుంటూ, ప్రత్యేకంగా గుండెకు బైపాస్ సర్జరీ చేయించుకుని పోటీలలో పాల్గొనబోతున్న డీవీ శంకర్రావు ని జాతీయ స్థాయిలో బంగారు పతకం తేవాలని ప్రోత్సాహించారు.

భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కు చెందిన మహంతి వెంకటకృష్ణాజి మాస్టర్-2 కేటగిరీలోని 74 కేజీల విభాగంలో, డివి శంకర్రావు మాస్టర్ 4 కేటగిరిలోని 83 కేజీల విభాగం లో, పాల్వంచకు చెందిన కిలారి భవాని శంకర్ మాస్టర్ 2 కేటగిరిలోని 93 కేజీల విభాగంలో , మేదరమెట్ల రంగారావు మాస్టర్ 2 కేటగిరిలోని 105 కేజీల విభాగంలో ఎంపికైనట్లు జిల్లా పవర్ లిప్టింగ్ జనరల్ సెక్రెటరీ జివి రామిరెడ్డి తెలిపారు.

ఈ ఎంపికైన క్రీడాకారులు గతంలో జిల్లా స్థా యి , రాష్ట్రస్థాయిలో బంగారు పతకాలు సాధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు భోగాల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా జనరల్ సెక్రెటరీ జీవి రామిరెడ్డి ( సిటీ స్టైల్ జిమ్ కోచ్ ) జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్, జిల్లా జాయింట్ సెక్రెటరీ గుగులోత్ శోభన్ నాయక్, భద్రాచలం పంచాయతీ ఈవో శ్రీనివాస్, ఎండి నవాబ్ తదితరులు పాల్గొన్నారు.