బేకరీ ప్రారంభోత్సవానికి గంగుల
24-08-2026 04:40 PM
ముకరంపుర, ఆగస్టు 24(విజయ క్రాంతి): కరీంనగర్ నగరంలోని 19వ డివిజన్ రేకుర్తి మెయిన్ రోడ్ జంక్షన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన గోల్డెన్ బేకరీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన మాజీ మంత్రి మరియు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్,నగర మేయర్ కోలగాని శ్రీనివాస్,19వ డివిజన్ కార్పోరేటర్ సుధగోని మాధవి-కృష్ణ గౌడ్ ఢిల్లీ డిఫెన్స్ విద్యా సంస్థల ఛైర్మెన్ కొత్త సతీష్ రెడ్డి లతో కలిసి ప్రారంభించినారు.ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి తో ఇలాంటి వ్యాపారాలు చేసుకుంటూ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో బేకరీ నిర్వాహకులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.






