01-06-2025 07:52:45 PM
పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి పట్టణంలోని అమర్ నగర్ నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్ ఇంటర్నేషనల్ స్కూల్(Laksh International School)ను స్థానిక నాయకులతో, స్కూల్ యాజమాన్యంతో కలిసి ఆదివారం పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు(MLA Vijaya Ramana Rao) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.