calender_icon.png 14 July, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దమ్మ తల్లి బోనాల పండుగలో ఎమ్మెల్యే విజయరమణ రావు

13-07-2025 07:17:44 PM

పెద్దపల్లి (విజయక్రాంతి): పట్టణంలోని తెనుగువాడ వద్ద గల పెద్దమ్మ తల్లి ఆలయంలో ఆదివారం బోనాల మహోత్సవం సందర్భంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నియోజకవర్గ ప్రజలు, పెద్దపల్లి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు(MLA Vijaya Ramana Rao) కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, ముదిరాజ్ సంఘం సభ్యులు, ముదిరాజ్ కులస్తులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.