13-07-2025 07:21:03 PM
మేడిపల్లి (విజయక్రాంతి): బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 24, 25 డివిజన్ లో మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్(Congress Party Incharge Thotakura Vajresh Yadav), బోడుప్పల్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ తో కలిసి గడపగడపకు తిరుగుతూ కాలనీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సొంతిల్లు ఉండాలన్న ప్రతి పేదోడికలను ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని, ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, సీనియర్ నాయకులు రాపోలు రాములు, బోడుప్పల్ నగర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విశ్వం గుప్త, మాజీ కార్పొరేటర్లు బొమ్మక్ కళ్యాణ్ కుమార్, జక్కుల పద్మా రాములు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు మాజీ ప్రజా ప్రతినిధులు, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.