శ్రీ రంగనాధస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే విజయరమణా రావు
పెద్దపల్లి (విజయక్రాంతి): మండలం బొంపల్లి గ్రామంలో శ్రీ భూగోదా సమేత శ్రీ రంగనాధస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్బంగా స్థానిక నాయకులతో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు(MLA Chinthakunta Vijaya Ramana Rao) ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు వేద మంత్రాల సాక్షిగా ఆశీర్వదించి ఘనంగా సన్మానించారు. ముందుగా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేను శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలను అందజేసిన ఎమ్మెల్యే ఓదెల
మండలం, కనగర్తి గ్రామంలో బుధవారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలను అందజేసి నూతన ఇండ్ల నిర్మాణాలకు ముగ్గులు పోసి భూమి పూజ చేసి పనులను పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఓదెల మండల పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.






