18 April, 2026 | 10:30 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

ఇంద్రకరణ్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

11-06-2025 05:21 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) భిక్కనూర్ మండలంలోని రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన బద్దం ఇంద్రకరణ్ రెడ్డి టిపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమకమైనందున బుధవారం కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ ఎంపీపీ తొగరి సుదర్శన్, మాజీ సర్పంచ్ తొగరి దశరథ్ తో డిసిసి నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్, మాజీ ఎంపీటీసీ చంద్రా గౌడ్ లు కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. అయన పార్టీకి చేసిన సేవలను గుర్తించి పదవి రావడానికి కృషి చేసిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ సెల్ అధ్యక్షులు అంతంపల్లి సుధాకర్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దయాకర్ రెడ్డి, బాపూరెడ్డి, మాజీ సర్పంచ్ నర్సింలు, సాజిద్, ఆంజనేయులు, బాబు ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.