4 July, 2026 | 1:56 AM

జీర్లపల్లి పీర్లను దర్శించిన ఎమ్మెల్యే

04-07-2026 01:14 AM

జహీరాబాద్, జూలై 3 : జరాసంఘం మండల పరిధిలోని జీర్లపల్లి గ్రామంలో నెలకొల్పిన పీర్లను జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణికరావు దర్శించుకున్నారు. మొహరం ముగించిన తర్వాత ఈ గ్రామంలో పీర్లను ప్రతిష్టించి ఊరేగింపు చేయడం ప్రతి సంవత్సరం చేస్తుంటారు. గ్రామ ప్రజల పిలుపుమేరకు ఎమ్మెల్యే మాణిక్ రావు గ్రామంలోని పీర్లను సందర్శించారు.

కుల మతాలకతీతంగా జరుపబడే పీల్దాం పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. పీర్లను దర్శించిన తర్వాత ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జరాసంఘం మండల బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎం.వెంకటేశం, గ్రామ పెద్దలు మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.