23-02-2026 12:00:00 AM
జూబ్లీహిల్స్,ఫిబ్రవరి 22(విజయక్రాంతి): కళ్యాణ్ నగర్లోని ముత్యాలమ్మ దేవాలయంలో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం ఆయన అమ్మవారిని దర్శించుకుని నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని మొక్కులు చెల్లించుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.