calender_icon.png 23 February, 2026 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్ నం.45లో ప్రమాదం

23-02-2026 12:00:00 AM

ముగ్గురికి గాయాలు

జూబ్లీహిల్స్, ఫిబ్రవరి22(విజయక్రాంతి): నగరంలోని అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం అతివేగంగా వెళ్తున్న ఒక కారు ఒక్కసారిగా అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న స్టీల్ పోల్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారు వేగం ఎక్కువగా ఉండటంతో విద్యుత్ స్తంభం దాని ధాటికి ఒంగిపోయింది.

ఈ హఠాత్ పరిణామంతో అప్రమ త్తమైన వెనుక వాహనదారులు ఒక్కసారిగా బ్రేకులు వేయడంతో, వెనుక నుంచి వస్తున్న మరో రెండు వాహనాలు ఒకదానికొకటి వరుసగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదాల్లో ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా స్థానికులు వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. వాహనా ల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని వెల్లడించారు.