21 April, 2026 | 6:37 PM

రైతుల నోట్లో మన్ను కొట్టకండి

31-05-2025 11:20 PM

ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి...

సారంగాపూర్ (విజయక్రాంతి): మండలంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(BJP leader MLA Alleti Maheshwar Reddy) శనివారం విస్తృతంగా పర్యటించారు. మండలంలోని తాండ్ర, వైకుంఠాపూర్, కంకెట గ్రామాల్లోని వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించి, కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. రైతుల సమస్యలను తెలుసుకొని, వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు. రైస్ మిల్లులో మ్యాచర్, తప్ప పేరుతో అధిక దోపిడీకి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని, అన్నం పెట్టే  రైతన్నలకు మన్ను కొట్టకుండా అండగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు ,రైతులు తదితరులు పాల్గొన్నారు.