21 April, 2026 | 5:12 PM

Breaking News

రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది.. కాంగ్రెస్ మళ్లీ గెలవదు!   •   ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •   మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •   అంగన్వాడీలో పోషక అభియాన్   •   ఇంటర్మీడియట్ మండల టాపర్ హారికను అభినందించిన పోలీసులు   •   మోదీ.. ఒక ఉగ్రవాది.. మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు   •   మేం ఏం చేసినా అడిగే వారెవ్వరు   •   కెసిఆర్ మెల్లకుంట తండాను జీపీగా ఏర్పాటు చేయకుంటే పట్టించుకునే నాదుడే ఉండేవాడు కాదు   •   రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ధ్వేయం..   •  

పర్మిషన్ లేని చోట నుండి ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని వినతి

31-05-2025 11:24 PM

నాగారం: నాగారం మండల పరిధిలోని పేరబోయిన గూడెం బిక్కెరు వాగు నుండి సాండ్ పర్మిషన్ ఉన్న చోటు  కాకుండా మరో చోటు నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణాను అరికట్టాలని శనివారం తహసిల్దార్ హరి కిషోర్ శర్మ(Tehsildar Hari Kishore Sharma)కు పేర బోయినగూడెం గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మన ఊరు మన ఇసుక  పాలసీ అనుమతి ఉన్నచోటును శాండ్రీచ్ ఆఫీసర్ గుర్తించి ఇసుకను తరలించారు.

కానీ అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్ఆర్ఓ మామూళ్ల మత్తులో మునుగుతో అక్రమ ఇసుక రవాణాకు సహకరిస్తున్నారని వారు ఆరోపించారు. జిల్లా ఉన్నతమైన అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో జి. లక్ష్మయ్య వేల్పుల రమేష్ పి నాగరాజు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.