అర్హులందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు ఇవ్వండి: కలెక్టర్ జి రవి నాయక్
మహబూబ్ నగర్: జూన్ 20వ తేదీన జాతీయ నులిపురుగుల దినోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ తెలిపారు. మంగళవారం వెబెక్స్ సమావేశం ద్వారా జిల్లా అధికారుల సమన్వయ సమావేశంలో జిల్లా కలెక్టర్ వివిధ అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో ఒక సంవత్సరం నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రను వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో 2,45,789 మంది పిల్లలకి ఈ మాత్రలు వేసేందుకు చర్చలు తీసుకోవాలని చెప్పారు. ఒకటి నుండి రెండు సంవత్సరాల వరకు సగం మాత్ర వేయాలని, అంగన్వాడి సెంటర్లు ప్రైమరీ స్కూల్స్ , హై స్కూల్స్ కాలేజీల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉన్న అన్ని విద్యాసంస్థల్లో ఈ మాత్రలు ఉచితంగా పంపిణీ చేయాలన్నారు.
ఈ మాత్రలు వేసుకోవడం వల్ల పిల్లల్లో ఉన్న నులిపురుగులు చనిపోతుందని, దీనివల్ల రక్తహీనత, పోషకాహార లోపం నివారించబడి పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా చురుకుగా ఉండి విద్యను అభ్యసించడం గానీ ఆడుకోవడం, పని చేస్తారని ఆయన తెలిపారు. కావున జిల్లాలో ఉన్న అందరి పిల్లలకు ఈ మాత్రలు వేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా జిల్లా సంక్షేమ శాఖ, విద్యాశాఖ, కళాశాల వాళ్లు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నాలని సూచించారు. వేసవికాలం ముగిసి వర్షాలు కురుస్తున్నందున, నీరు నిల్వ ఉంటుందని, నిల్వ నీటిలో దోమలు పెరిగి మలేరియా గానీ, ఫైలేరియా గానీ చికెన్ గున్యా గాని డెంగు గాని వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటుందన్నారు. ప్రజలందరూ తాము వాడే కూలర్ల లోని నీటిని అదేవిధంగా పాత సామాన్లు టెంకాయ చిప్పలు, పాత ప్లాస్టిక్ డబ్బాలో ఉన్న నీటిని తొలగించుకుంటే దోమల ద్వారా వచ్చే వ్యాధులను అరికట్టవచ్చాని చెప్పారు.
సిఎం ప్రజావాణి ద్వారా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు, ఈ ఆఫీసు ద్వారా పెండింగ్ పైళ్ళను సంబంధిత అధికారులు వేగవంతంగా పరిష్కారం ఆదేశించారు.యాసంగి ధాన్యం కొనుగోళ్ళపై సమీక్షించారు. మిగిలిన ధాన్యంసేకరణను వెంటనే పూర్తి చేయాలని, అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలలు ప్రారంభం రోజున విద్యార్థులకు ఒక జత యూనిఫాం, నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యము చేయాలని సూచించారు. ఈ సమావేశం లో రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావు తదితరులు ఉన్నారు.






