08-10-2025 01:04:35 AM
బిచ్కుంద, సెప్టెంబర్ 7 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శెట్కార్ మల్లికార్జున్ అప్పా నివాసానికి వెళ్లి మల్లికార్జున్ అప్పా చిత్రపటానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ తో కలిసి నివాళులు అర్పించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లికార్జున్ అప్పా సతీమణిని పరామర్శించి,ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని శోకార్థులైన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు.