calender_icon.png 9 October, 2025 | 3:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఆర్‌వీఆర్‌పై శిక్షణా కార్యక్రమం

08-10-2025 01:03:23 AM

 గాంధారి అక్టోబర్ 7 (విజయ క్రాంతి):  గాంధారి ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో అగ్నిమైంటైన్ రియాల్టీ  వర్చువల్ రియాల్టీ పైన మంగళవారం రోజున ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమాన్ని సిద్ధరామిరెడ్డి జిల్లా సైన్స్ అధికారి ఆధ్వర్యంలో చేపట్టడం  జరిగింది. విద్యార్థులకు సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా విద్యా బోధన జరుపాలని విద్యార్థులలో టెక్నాలజీ పైన అవగాహన కల్పించి ప్రతి ఒక్క విద్యార్థి ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని పాఠ్యాంశాలు నేర్చుకునే విధంగా ప్రతి ఉపాధ్యాయుడు విద్యా బోధన చేయాలని తెలియజేయడం జరిగింది.

సుమారు పది లక్షల రూపాయల విలువగల పరికరాలను ప్రభుత్వం మన జిల్లాలో 8 పాఠశాలలకు అధునాతన పరికరాలను అందజేయడం జరిగింది. వీటి ద్వారా విద్యార్థులు చక్కగా పాఠ్యాంశాలు నేర్చుకునే అవకాశం ఉంది. ఈ శిక్షణ కార్యక్రమంలో 8 పాఠశాలలకు సంబంధించిన ప్రధానోపాధ్యాయులు గణిత సామాన్య శాస్త్ర ఇంగ్లీష్ సబ్జెక్టు టీచర్లకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుజాత, గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గోవర్ధన్ రెడ్డి, కోఆర్డినేటర్ అరుణ్  వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.