చీఫ్ సెక్రటరీకి ఎమ్మెల్యేల వినతి
30-05-2024 01:49 AM
ఆదిలాబాద్, మే 29 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలోని పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వచీఫ్ సెక్రటరీ శాంతికుమారిను బుధవారం హైదరాబాద్‌లోని సచినవాలయంలో ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్ కలిసి వినతిపత్రం అందించారు. రైతులు రాశి 659 రకం పత్తి విత్తనాలు నాటడానికి గ్గు చూపుతున్నారని, అక్కడి నేల స్వభావానికి ఆ విత్తనాలు అనుకూలంగా ఉన్నాయని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. కానీ కొందరు ఇదే బ్రాండ్‌తో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారన్నారు. కొందరు డీలర్లు రైతులు ఇష్టపడని వంగడాలను అంటగడుతున్నారన్నారు. రైతు సమస్యలను పరిష్కరించాలని కోరారు.






