28 July, 2026 | 12:55 AM

టెండర్ లేకుండానే సోమ్ కంపెనీకి అనుమతులు

30-05-2024 01:48 AM

బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ ప్రకాష్

హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి) : తెలంగాణ ప్రభుత్వం పాలనను పక్కన పెట్టి కేవ లం లిక్కర్ ద్వారా ఆదాయం పొందటమే ధ్యే యంగా పనిచేస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ విమర్శించారు. అందుకే రాష్ట్రంలోకి టెండర్ ప్రక్రియ లేకుండానే కొత్త లిక్కర్ కంపెనీలు అడుగుపెడుతున్నాయని అన్నారు.  బుధ వారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోకి  కొత్త మద్యం బ్రాండ్లు రావడం లేదని ఎక్సైజ్ శాఖ మంత్రి ప్రకటించిన 5 రోజుల్లోనే మాట మార్చారని ధ్వజమెత్తారు. 

సోమ్ డిస్టిల రీకి చెందిన 5 బ్రాం డ్లు వస్తున్నాయని మంత్రినే ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు.  దక్షిణాదిలో  లిక్కర్ అమ్మ కాల్లో తెలంగాణ నెంబర్ వన్ అని చెబుతున్న కాంగ్రెస్ సర్కార్.. ఇతర రంగాలను గాలికొదిలేసిందని విమర్శించారు. గల్లీగల్లీకి లిక్కర్ షాపు అన్నట్లుగా రాష్ట్రంలో పరిస్థితిని మార్చేస్తున్నారని మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌లోనే నిషేధం ఉన్న ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్‌కు చెందిన సోమ్ డిస్టిలరీస్‌ను  మన రాష్ట్రంలోకి ఆహ్వానించడం గర్హనీయమన్నారు. ఆదాయం పెం చుకునేందుకు ఇదొక్కటే మార్గమా అని ప్రశ్నించారు.  రాష్ట్రాల నుంచి అక్ర మంగా ఢిల్లీకి కప్పం కట్టే ప్రక్రియ కొనసాగుతున్నదని విమర్శించారు.