calender_icon.png 14 February, 2026 | 10:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గెలిచిన అభ్యర్థులను సన్మానించిన ఎమ్మెల్సీ చల్లా, ఎమ్మెల్యే విజయుడు

14-02-2026 01:34:47 AM

అలంపూర్, ఫిబ్రవరి 13 అయిజ: అలంపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ తరఫున గెలిచిన  కౌన్సిలర్లను ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి,ఎమ్మెల్యే విజయుడు అభినందించా రు. అయిజ 13 వార్డులు అలంపూర్ ఐదు వార్డులను బీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకుంది ఈ తరుణంలో వారంత శుక్రవారం కర్నూల్ పట్టణంలోని ఎమ్మెల్సీ స్వగృహంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యే విజయుడును  మర్యాదపూర్వకంగా కలిశారు.

అనంతరం గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపి శాలువా కప్పి పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఇరువురు పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐజ మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి  సీఎం సురేష్, మాల నరసింహులు ,అలంపూర్ ఆసిఫ్ ఖాన్, శేఖర్ రెడ్డి, పిండి జయరాములు , నాయకులు వావిలాల రంగారెడ్డి,నాగర్ దొడ్డి వెంకట రాముడు కురువ పల్లయ్య, అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.