1 August, 2026 | 1:24 AM

బోనాల ఉత్సవాల చెక్కులు పంపిణీ

01-08-2026 12:29 AM

సికింద్రాబాద్, జూలై 31 (విజయక్రాంతి): మన సంస్కృతి, సంప్రదాయాలను మరింత పెంపొందించే విధంగా బోనాల ఉత్సవాలను ఘనంగా జరుపుకుందామని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ అన్నారు.

శుక్రవారం సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయం ప్రాంగణంలో సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని 242  దేవాలయాలకు బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం కోటి 54 లక్షల 35 వేల 400 రూపాయల విలువైన ఆర్ధిక సహాయం చెక్కులను కోట నీలిమ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, అసిస్టెంట్ కమిషనర్ సంధ్యారాణి, ఇన్ స్పెక్టర్ శ్రీదేవి ఈవో మనోహర్ రెడ్డిలతో కలిసి అందజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ మన సంస్కృతి, సాంప్రదాయాలను చాటిచెప్పే బోనాల ఉత్సవాలను ప్రభుత్వం రూ. 20 కోట్లు కేటాయించి రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోందని చెప్పారు. బోనాలను వైభవంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో దేవాదా య శాఖ పరిధిలోని ఆలయాలకే కాకుండా ప్రైవేట్ ఆలయాలకు కూడా ఆర్ధిక సహాయం అందించినట్లు వివరించారు. ప్రభుత్వం అం దిస్తున్న ఆర్ధిక సహాయాన్ని ఆలయాల అలంకరణ, బోనాల ఉత్సవాల కోసం సద్విని యోగం చేసుకోవాలన్నారు. సనత్ నగర్ ని యోజకవర్గంలోని ప్రతి ఆలయానికి ప్రభు త్వం అందిస్తున్న ఆర్థిక సహాయం బోనాల ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు దోహదపడుతుందని అన్నారు.