1 August, 2026 | 1:23 AM

సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

01-08-2026 12:31 AM

మేడ్చల్ జిల్లా గ్రంథాలయ మాజి చైర్మన్ భాస్కర్ యాదవ్

మేడ్చల్ అర్బన్ జూలై 31(విజయక్రాం తి): మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో అండర్ డ్రైనేజీ పైప్ లైన్ పనులు,సిసి రోడ్లు,పూర్తిగా దెబ్బతిన్నాయని మేడ్చల్ జిల్లా గ్రంథాలయ మాజి చైర్మన్ బాసురాది భాస్కర్ యాదవ్ మేడ్చల్ బిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజి మంత్రి వ ర్యులు చామకూర మల్లారెడ్డికి వినతి పత్రం అందజేసినట్లు చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడ్చల్ జాతీయ రహదారి నుండి మేడ్చల్ రైల్వే స్టేషన్ ము కుంద్ టాకీస్ నుండి రైల్వే స్టేషన్,మేడ్చల్ హౌసింగ్ బోర్డు కాలనీ నుండి రైల్వే స్టేషన్, చాపల మార్కెట్ నుండి బాయ్స్ హైస్కూల్, జాతీయ రహదారి నుండి గిర్మాపూర్ హనుమాన్ ఆలయం వరకు సీసీ రోడ్లు,అండర్ డ్రైనేజీ పైప్ లైన్ పనుల కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరినట్లు ఆయన స్పష్టం చేశారు.

మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ పరిధిలో రోడ్లు,అండర్ డ్రైనేజీ మ్యాన్ హోల్ ల మరమ్మత్తులు చేయకుండా విద్యా సంస్థలకు వెళ్ళే విద్యార్థులు, వ్యాపారులు, గర్భిణులు ఆసుపత్రు లకు వెళ్లాలంటే ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భాస్కర్ యాదవ్ ఎమ్మెల్యే మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలియజేశారు.

మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో అండర్ డ్రైనేజీ పనులు,సీసీ రోడ్లను ఏర్పాటు చేయుటకు ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే మల్లారెడ్డి హామీ ఇచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ మాజి కో ఆప్షన్ సభ్యులు అకిటి నవీన్ రెడ్డి.మేడ్చల్ మండల బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు చీర్ల దయానంద్ యాదవ్.రఘుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.