29 August, 2026 | 11:54 AM

Breaking News

క్రీడలకు సంపూర్ణ సహకారం

21-05-2024 01:38 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

పటాన్‌చెరు, మే 20 (విజయక్రాంతి) : క్రీడలకు, క్రీడాకారులకు సంపూర్ణ సహకారం అందిస్తానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. పటాన్‌చెరు మండలం పాటి గ్రామంలో సోమవారం నిర్వహించిన పాటి క్రికెట్ ట్రోఫీ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని క్రీడలకు వేదికగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా మినీస్టేడియాలను నిర్మించడంతో పాటు ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

పటాన్‌చెరు పట్టణంలో రూ. 7.50 కోట్లతో మైత్రి మైదానాన్ని ఆధునీకరించినట్లు చెప్పారు. పాటి గ్రామంలో ఐదు ఎకరాల్లో మినీ స్టేడియం నిర్మిస్తున్నామన్నారు. విద్యార్థి దశ నుంచి క్రీడలపై ఆసక్తి పెరిగేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. అనంతరం విజేత జట్టుకు రూ. 69,999, రన్నరప్ జట్టుకు రూ. 39,999 సొంత నిధులతో నగదు బహుమతులను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు లక్ష్మణ్, స్వామిగౌడ్, సీనియర్ నాయకులు దశరథ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, స్థానిక నాయకులు, యువకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.